- నియామకం.. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా కార్యదర్శిగా వెంకటేష్
వేద న్యూస్ , ఇల్లందకుంట:
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ నేత అకినపల్లి వెంకటేష్ నియమితులయ్యారు.
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు అకినపల్లి వెంకటేష్ కు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ “నన్ను నియమించిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కి, నా నియామకానికి సహకరించిన ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొరివి అరుణ్ కుమార్ కి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్” కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇల్లందకుంట మండల, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.”నా మీద నమ్మకంతో నాకు ఎస్సీ డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తాను” అని చెప్పారు.
