బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల సౌజన్య రత్నాకర్ రెడ్డి

వేద న్యూస్, శాయంపేట:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ ప్రజలు తనని ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆరేపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థి సౌజన్య రత్నాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. సర్పంచ్ అభ్యర్థి సౌజన్య రత్నాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పారదర్శక పాలన సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధాన్యధాని మాట్లాడారు. నిరంతరం ప్రజాసేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయాల్లో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభిమానం సహకారం తమ విజయం నిర్ణయిస్తుంది అన్నారు.