– ప్రయాణికులకు ఇబ్బందులు
వేద న్యూస్,ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో నూతనంగా ఏర్పడిన వైన్ షాప్,నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మహిళలు చిన్నపిల్లలు వెళ్లే దారి, చుట్టుపక్కల నివాసం ఉంటారు. రోడ్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. నిత్యం నారాయణపూర్ నుండి ఎల్లారెడ్డిపేటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇదే మార్గం నుండి రావాల్సి ఉంటుంది. ప్రతి ఆటోలు బైకులు ప్రయాణికులు ఇదే మార్గంలో నడుస్తా ఉంటారు. ప్రమాదాలు జరుగుతే ఎవరు బాధ్యులు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు పర్మిషన్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి, ఇక్కడే రెడ్డి సంఘం చర్చా మండలి ఉంది ఇందులో పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. సమీపంలో పాలకేంద్రం కూడా ఉంది ప్రతిరోజు అక్కడికి సాయంత్రం పూట అందరూ వస్తా ఉంటారు ఎవరికైనా ప్రమాదం జరుగుతే బాధ్యత వహించాల్సింది ఎవరు, ఆప్కారి అధికారులకు, ఎమ్మార్వోకు సైతం ఫిర్యాదు చేశారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిమిషన్ లేకుండా పర్మిట్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం వెనకాల ఉన్నది ఎవరు, ఇక్కడ ఈ వైన్ షాప్ నడవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందువలన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనట్లయితే భవిష్యత్తులో అనేక సంఘటనలు దారి తీసే అవకాశం ఉన్నట్లు స్థానికులు తెలిపారు.