వేద న్యూస్, తిమ్మాపూర్ :
తిమ్మాపూర్ మండలంను స్తులాపూర్ గ్రామ రెవిన్యూ పరిధిలోనీ సర్వే నెంబర్:574, 576 లోని 15-17 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా షాలిని విద్యా సంస్థ అక్రమ పద్ధతిలో (పివోటి -1977) చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూమినీ రెగ్యలరైజ్ చేయవద్దని, 2007 లో నీ ఈ భూమిని ప్రభుత్వం స్వాదినం చేసుకున్నది. స్వాదినం చేసుకున్న అసైన్డ్ భూమి చుట్టూరుగా ప్రభుత్వ భూమి అని బోర్డులు,హద్దులు ఏర్పాటు చేయాలనీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేయడం జరిగింది.అనంతరం ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ గత 20 సంత్సరాలుగా షాలిని విద్య సంస్థ యాజమాన్యం అక్రమ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ (పివోటి )-1977 చట్టానికి విరుద్ధంగా 15-17 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీని పై అనేక పిర్యాదులు చేస్తున్న అధికారులు మాత్రం పట్టనట్లు ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. డబ్బులు ఉన్నవాళ్లు ఏది చేసిన చెల్లుతుందా అని ప్రశ్నించారు. రెవిన్యూ అధికారులకు అన్ని తెల్సిన ఏమి పట్టనట్లు వ్యాహరించడం సరైంది కాదని విమర్శించారు. షాలిని విద్యాసంస్థ అధీనంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమికి రెవిన్యూ అధికారులు హద్దులు పెట్టాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ కు ఇచ్చిన భూమిని కూడా షాలిని వద్య సంస్థ కబ్జా చేసి గేట్లు పెట్టుకున్నారని అయిన ఏ అధికారి కూడా సప్పుడు చేయడం లేదని విమర్శించారు. షాలిని విద్య సంస్థ పై అప్పటి తహసీల్దార్ పంపిన రిపోర్టు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ (పివోటి) చట్టాము 1977 లోని అనుబంధం 3:2 క్రమము అట్టి భూమిని ప్రభుత్వ భూమిని ప్రభుత్వంస్వాదినపర్చుకోనైనది తేదీ 2-11-2007లో పైల్ నెంబర్ :బి / 293/1/2007 తిమ్మాపూర్ తహసీల్దార్ రెవిన్యూ డివిజనల్ అధికారి కి పంపినారు. జిల్లా కలెక్టర్ కి,రెవిన్యూ డివిజనల్ అధికారి కి పంపిన పేపర్ లో భూమి స్వాదినం చేసుకున్నట్లు ఉన్నది. కానీ ప్రభుత్వ అసైన్డ్ భూమి మాత్రం షాలిని విద్య సంస్థ అధీనంలోనే ఉన్నది. అసైన్డ్ భూమిలో ఎలాంటి నిర్మాణా అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద భావనలు నిర్మించారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక విద్యాసంస్థ అధీనంలోనే ఉండటం దుర్మార్గం అన్నారు. కావున జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సర్వే నెంబర్:574, 576 లోని 15-17 ఎకరాల భూమికి చుట్టూరుగా ప్రభుత్వ అసైన్డ్ భూమిగా ఇది ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేయగలరనీ విజ్ఞప్తి చేశారు.
అసైన్డు భూములను ఎవ్వరైనా కనుగొలు చేసిన, కబ్జాలు చేసిన మరియు భూమి బాదలయింపు చేసిన పివోటి చట్టం -1977 ప్రకారం జైలు శిక్షలు వేయాలని, కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాదినం చేసుకోవాలని చట్టం చెప్పుతుంది. అసైన్డు భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్టర్ లకు లేదని హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అసైన్డు భూమిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు షాలిని విద్యసంస్థ యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కావున ఎట్టి పరిస్థితిల్లో చేయవద్దని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేయడం జరిగింది.
కలెక్టర్ కి పిర్యాదు చేసిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామెర బద్రి నేత, జి. ప్రశాంత్ కుమార్, నాయకులు లచ్చుమయ్య పాల్గొన్నారు.