వేద న్యూస్, వరంగల్ టౌన్ :  ఓరుగల్లు మహానగరంలో జులై 20వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంటల కు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు ఎంజిఎం జంక్షన్ ,పోచమ్మ మైదానం యూటర్న్ తీసుకొని ఎంజీఎం జంక్షన్ వెంకటేశ్వర గార్డెన్ వరకు జగన్నాధుడి రథయాత్ర అత్యంత వైభవ వేత్తంగా భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా కీర్తనలు భజనలు నడుమ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ టెంపుల్ వరంగల్ నిర్వాహకులు మురళి వదన కృష్ణ దాస్ ప్రభు తెలిపారు. ఈ రథయాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు, యువతి, యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపాకు, పాత్రులు అయ్యి విజయవంతం చేయగలరని కోరారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు లడ్డు ప్రసాదాలను అందించనున్నట్లు, అదే విధంగా రాత్రి వెంకటేశ్వర గార్డెన్ లో జరిగే ముగింపు కార్యక్రమంలో భక్తి ఉపన్యాసాలతో, పాటు భోజన వితరణ కూడా ఉంటుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వరంగల్ మహానగరంలో ఈ జగన్నాథుడి రథయాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు. జగన్నాథుడి రథయాత్ర తో పాటు ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏకాదశి తదితర పర్వదినాలు అత్యంత వైభవ్వేత్తంగా నిర్వహించడం జరుగుతుందని మురళీవదన కృష్ణ దాస్ ప్రభు మీడియా సమావేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి వర్ధన కృష్ణ దాస్, భూ పవన హరి నామదాసు, చిట్ట హరి గోపాల దాస్, కారుణ్యమయ కృష్ణ దాస్, విజయ్ రఘునాథ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *