వేద న్యూస్, శాయంపేట:

జిల్లా విద్యాశాఖ అధికారి హన్మకొండ ఆదేశానుసారం సోమవారం జిల్లా పరిషత్ పెద్దకొడపాక పాఠశాల యందు ప్రాథమికోన్నత స్థాయి గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నడికూడ ,శాయంపేట, పరకాల మండలాల గణిత ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా సులభంగా గణిత బోధన విద్యార్థులకు చేరువయ్యేలా ఏ విధంగా చేయాలి,గత నెలలో నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ ఆధారంగా విద్యార్థుల స్థాయిలను అనుసరించి బోధన ఏ విధంగా చేపట్టాలి. నిజజీవితంలో గణిత భావనల ఉపయోగము, ఉపాధ్యాయులు తరగతి గది బోధనలో భాగంగా అనుసరించిన వ్యూహాలు నిర్వహించాల్సిన టీచింగ్ డైరీ, ఇయర్ ప్లాన్ ,యూనిట్ ప్లాన్ ,పీరియడ్ ప్లాన్ ల గురించి చర్చించడం జరిగింది. బోధనలో సాంకేతిక పరిజ్ఞాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ సమావేశం లో చర్చించడం జరిగింది. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మాలోత్ సారయ్య నాయక్ మాట్లాడుతూ గణిత భావనలను విద్యార్థులకు సులువుగా పరిచయం చేయాలని, ప్రతి ఒక విద్యార్థి గణితాన్ని తన దైనందిన జీవితంలో అతి సులువుగా ఉపయోగించుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతంగా తయారు చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో 28 మంది గణిత ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ లైన రఘు, రజినీకాంత్ ,ఉదయ్ , సిఆర్పి వంశీ పాల్గొన్నారు.