వేద న్యూస్, చొప్పదండి:

పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా – సబ్బండ వర్గాలకు ప్రజా ప్రభుత్వ అండ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొలిమికుంటలో గ్రామ ఇంచార్జి ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి గ్రామంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం నాయకత్వంలో అవినీతి లేని పరిపాలన అందిస్తున్నామన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ కొత్తూరు మహేష్, పట్టణ అధ్యక్షుడు నిజానపురం చందు, నాయకులు ముద్దసాని రంగన్న, ముద్దం తిరుపతి, పెరుమాండ్ల గంగయ్య, కొట్టె అశోక్, వల్లాల కృష్ణహరి, మునిగాల సుధాకర్, మునిగాల చందు, తాళ్ళపెల్లి శ్రీనివాస్, మావురపు రాములు, గుర్రం రమేష్, తోడేటి డేవిడ్, ఆకుల సురేష్, అనుమల్ల సత్యం, గుంటి స్వరూప, గోస్కుల కొమురెళ్ళి, కొట్టె చందు, నూనె చందు, కనుమల్ల రాజశేఖర్, బొడిగె తిరుపతి, చిల్ల ఐలయ్య, పెరుక శ్రీనివాస్, బండారి రాజేశ్, నూనె శేఖర్, జహంగీర్, బండారి అఖిల్, వడ్లూరి నాగరాజు, రాజ్ కుమార్, చొక్కల్ల లక్ష్మణ్, గుర్రం చిన్న రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..