”
వేద న్యూస్,కరీంనగర్:
హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ సుజాత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు రామచంద్రరావుకు పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన నాయకత్వంలో బిజెపి మరింత బలపడాలని ఆకాంక్షించారు. రామచంద్రరావు నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమవుతుందని డాక్టర్ సుజాత రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరి అనిల్ కుమార్ విజయ రాజు తదితరులు పాల్గొన్నారు