వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డులో డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి డీ.ఎస్.రెడ్యా నాయక్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోని ప్రజలందరికీ వివరిస్తు్న్నట్లు గులాబీ పార్టీ నేతలు తెలిపారు. మరిపెడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, 11వ వార్డ్ కౌన్సిలర్ ఏడెల్లి పరశరములు,10వ వార్డ్ కౌన్సిలర్ బదావత్ హథీరామ్ నాయక్, ఏడెల్లి సైదులు ,రవి, ఉప్పలయ్, ఇద్దయ్య, బాషిపంగు వెంకన్న, వీరబాబు, మట్ట కాటయ్య, ఏడెల్లి వెంకటేష్ (దరువు) తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.