వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో : 

రాబోయే ఎన్నికల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కచ్చితంగా ఉంటుందని, రాబోయే ఎన్నికలలో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న వివిధ సమస్యలపై పార్టీ గళమెత్తుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, వారి తరపున పోరాడటానికి ప్రజల్లోకి వెళ్తామని, విస్తృతంగా తిరుగుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చింది. దీంతో తెలంగాణలోని జనసేన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *