Oplus_16777216
  • ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్

వేద న్యూస్, వరంగల్:

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు మరియు డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకత్వం మూడు దశల పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మొదటి దశ పోరాటంలో భాగంగా అన్ని మండల కేంద్రాలలోని తహసీల్దార్ ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమోరండం సమర్పించాలని, అదేవిధంగా ఆగస్టు ఒకటో తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 23వ తేదీన హైదరాబాదులో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక తహసీల్దార్ రాజేష్ గారికి యు ఎస్ పి సి మండలం, జిల్లా, రాష్ట్ర నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.

అనంతరం రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే వెలువరించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న ఆర్థిక బిల్లులు మంజూరు చేయాలని,01.07.2023 నుండి పి ఆర్ సి అమలు చేయాలని,ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు సవరించి తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని,పదవి విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.

కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, వీటితోపాటు పెండింగ్ లో ఉన్న ఇతర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చందుపట్ల రాజేందర్,డిటిఎఫ్ మండల అధ్యక్షులు దాసరి రవీందర్ ,ప్రధాన కార్యదర్శి మాడుగుల నవీన్ కుమార్, టిపీటీఎఫ్ మండల అధ్యక్షులు ఆర్.బిక్షపతి,ప్రధాన కార్యదర్శి కాలేసి కొమురయ్య,యు టి ఎఫ్ నాయకులు ప్రదీప్ కుమార్,ఎస్ ఎస్ ఎ సంఘం నాయకులు రాజు నాయక్ ,శ్రీకాంత్,  వివిధ సంఘాల నాయకులు పి.శ్రీకాంత్,స్టాలిన్,బి.అశోక్ కుమార్ , పి.లక్ష్మణ్, ఎ .మోహన్,పి.శ్రీధర్ రెడ్డి,కె. ఎల్లయ్య,రఘు బాబు తదితరులు పాల్గొన్నారు.