వేద న్యూస్, మరిపెడ:
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ మీటింగ్లో మరిపెడ మండల మాదిగ జర్నలిస్ట్ ఫోరం
నూతన మండల కమిటీని నియమించారు.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండలం నూతన అధ్యక్షుడిగా చింత వెంకన్న, ఉపాధ్యక్షుడిగా గంగుల వెంకటేష్, కార్యదర్శి తప్పెట్ల సురేష్ ,కోశాధికారి భాష్పంగు వెంకన్న, సహాయ కార్యదర్శి భాష్పాంగ్ సోమన్న నియమితులయ్యారు.

కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం తొర్రూర్ మండల జర్నలిస్టులు, నరసింహులపేట మండల జర్నలిస్టులు, పెద్దవంగర జర్నలిస్టులు, ఇతర మండల జర్నలిస్టులు రాష్ట్ర నాయకులు జిన్నా లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.