- కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని అభ్యర్థన
వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం ఆయన ఉమ్మడి మరిపెడ చిన్న గూడూరు మండలాల గులాబీ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలే తన దేవుళ్లని, తాను వారికి భక్తుణ్ణి మాత్రమే అని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని, తనను ఆదరించాలని ప్రజలను కోరారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తానేనని, చేయబొయ్యేది కూడా తానే అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాలు చేరినయని వివరించారు. సంక్షేమ పథకాలు అందించిన తమకు ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంజనేయస్వామి గుడి లేని ఊరు లేదని, కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని వెల్లడించారు.
కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు , యువజన నాయకులు డిఎస్ రవిచంద్ర, రామడుగు అచ్యుత రావు, మరిపెడ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర కుమారి, ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారద రవీందర్ తదితరులు పాల్గొన్నారు.