వేద న్యూస్, హనుమకొండ:
ఈ నెల 29 న, అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకతీయ జూలాజికల్ పార్క్, హన్మకొండలో విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా అటవీ శాఖ మరియు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహించారు.
ఇందులో 100 మందికి పైగా విద్యారినీ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, చిత్రలేఖనం, వ్యాసరచన వకృత్వ పోటీలలో ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, కన్సోలోషన్ బహుమతులు ఈ నెల 29 న జరుగనున్న అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున ముఖ్య అతిథులచే ఇవ్వనున్నారు.
ఈ పోటీలకు హన్మకొండ ఫారెస్ట్ జూ ఎఫ్.బి.ఓ. శ్వేత, వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు, ప్రముఖ పర్యావరణ వేత్త, ఔల్స్ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు, వనసేవా సొసైటీ NGO కార్యదర్శి నరేష్, జూ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తల్లితండ్రులు, మరియు తల్లితండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
