వేద న్యూస్, హన్మకొండ:
“ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం-అటవీ శాఖ, హనుమకొండ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కమలాపూర్ లోని ఎం.జే.పీ.టీ.బీ.సీ. వెల్ఫేర్ స్కూల్ (బాలురు) లో “వన మహోత్సవం” నిర్వహించారు. దాదాపు 100 కు పైగా వివిధ రకాలైన మొక్కలను విజయవంతంగా సోమవారం నాటారు. మొక్కలు ఎందుకు నాటాలో, ఎలా నాటలో, నాటిన మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో, వాటి ఆవశ్యకత గూర్చి అతిథులు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు.
ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జీ.ఓ. కు, ప్రిన్సిపాల్ కు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హన్మకొండ జిల్లా అటవీ అధికారి, అనుజ్ అగర్వాల్ ఐ.ఎఫ్.ఎస్. అభినందనలు తెలియ చేశారు.

కార్యక్రమానికి ఎం.జే.పీ.టీ.బీ.సీ. వెల్ఫేర్ స్కూల్ (బాలురు) ప్రిన్సిపాల్ T.రవీందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఎఫ్.ఆర్.ఓ., భిక్షపతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థపక అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు, ప్రముఖ పర్యావరణవేత్త, పిట్టల రవిబాబు లు పాల్గొన్నారు. చివరగా చెట్లను వనాలను, వణ్యాలను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది మరియు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

