వేద న్యూస్, వరంగల్:
ప్రస్తుత జెన్ జెడ్(జనరేషన్ జెడ్) పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న తరుణంలో ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మనువాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘వేద న్యూస్’ ప్రత్యేకంగా అందిస్తోంది.
ఖండాంతరాలు దాటిన ప్రేమను పెళ్లిగా మార్చుకున్న నవ వధూవరుల పెళ్లి మహోత్సవానికి వరంగల్ వేదికయింది.
వరంగల్ పోచమ్మ మైదానికి చెందిన డాక్టర్ అశోక్ సునీతల కుమారుడైన రితేష్ అమెరికాలోని పిట్స్ బర్గ్ చెందిన జూలీయాన్ అమ్మాయితో గురువారం వెంకటేశ్వర గార్డెన్లో ప్రేమ వివాహాన్ని అత్యంత ఘనంగా బంధుమిత్రులు కుటుంబ సమేతంగా నిర్వహించారు.

వివాహ తంతును అమెరికా అమ్మాయి కుటుంబ సభ్యులు ఆద్యంతం ఆనందంగా.. జరుపుకోవడం పెళ్లికి విచ్చేసిన అందర్నీ ఆకట్టుకుంది.
