- బాధితులకు అందజేసిన ఎస్ఐ రామారావు
వేద న్యూస్, ఖమ్మం:
ఖమ్మం జిల్లా వైరా మండలంలో గత కొంత కాలంగా చోరీ అవుతున్న అలాగే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అతి తక్కువ సమయంలో వైరా పోలీసులు రికవరీ చేశారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో 1లక్షలు విలువ చేసే 5 సెల్‌ఫోన్లను రికవరీ చేసి,వాటిని బాధితులకు మంగళవారం అందించారు.
వైరా ఎస్సై రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ పాత మొబైల్ ఫోన్ల ను కొనరాదని, మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్ లను రికవరీ చేయడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందినీ అభినందించారు. బాధితులు సెల్ ఫోన్లు తీసుకున్న అనంతరం ఎస్సై రామారావుకి పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.