- సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- సంజీవని ఆసుపత్రి డాక్టర్ ఊడుగుల సురేష్
వేద న్యూస్, ఇల్లందకుంట:
ప్రస్తుతం వానకాలం సీజన్ లో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజురాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు, ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేష్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం జన వికాస ఆధ్వర్యంలో జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపృతి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యుడు సురేష్ ను, జన వికాస వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫ్రీ హెల్త్ క్యాంపునకు చక్కటి స్పందన వచ్చినట్టు పేర్కొన్నారు.

