వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా :

కురుపాం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీని మూలిగూడ జంక్షన్ నుండి కురుపాం మండల కేంద్రంలో గల ధూళికేశ్వర స్వామి ఆలయం వరకు రైతులు వారి సొంత ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.

జగదీశ్వరి  మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 7000 చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి రూ. 20,000 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.