వేద న్యూస్, వరంగల్:
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి.

భారీ స్థాయిలో వర్షం రోడ్లపై ఇతర ప్రాంతాల్లో నిలవడం చూసి జనం భయపడుతున్నారు.
వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు కష్టమే అని అభిప్రాయపడుతున్నారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది.సహాయక చర్యలలో అధికారులు, సిబ్బంది తలమునకలయ్యా రు.
అత్యవసర సహాయార్ధం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు వరంగల్ జిల్లా 1800 425 3434, 9154225936 హనుమకొండ 1800 425 1115, జిడబ్ల్యూ ఎంసీ 1800 425 1980, 9701999676 నెంబర్లను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
