వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి :
పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం గెడ్డలుప్పి, తామర కండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షులుగా నియమతులైన చొంగల సింహాచలం, యమల శ్రీరామలునాయుడు డైరెక్టర్లు భోగి అప్పలనాయుడు వెన్నెల శంకర్రావు, అంటిపేట పిఎసిఎస్ చైర్మన్ ఎగిరెడ్డి భాస్కరనాయడు తదితరులు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంగళవారం ఉదయం టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పూలమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర సహకారంతో తమకు పదవులు వచ్చాయని వాటిని రైతుల కోసం ఉపయోగించి ప్రభుత్వానికి ముఖ్యంగా ఎమ్మెల్యే విజయ్ చంద్రకు మంచి పేరు తీసు కొస్తామని స్పష్టం చేశారు.
పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు గా ఎంపికైన నాయకులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
