వేద న్యూస్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ రైతు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
నాగార్జున రెడ్డి అనే రైతు ఫోన్ పే నుండి మండల సర్వేయర్ అకౌంట్ కు పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగా ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ ప్రారంభించారు. నాగార్జున రెడ్డి రైతు నుండి భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వే యర్ సునీల్ అకౌంట్ కు ఫోన్ పే ద్వారా రూ.10 వేలు ట్రాన్స్ఫర్ చేశారు.