- కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి
- ప్రజలకు వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి సతీమణి రేణుక అభ్యర్థన
వేద న్యూస్, వరంగల్:
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్‌లో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గడపకు వెళ్లి బీజేపీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రదీప్ రావు సతీమణి సతీమణి రేణుక ప్రచారం చేశారు.

కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ప్రదీప్ రావును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

బీజేపీ చేస్తున్న అభివృద్ధిని వివరించి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీజేపీ ప్రజలకు భరోసా కల్పిస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు.