వేద న్యూస్, శాయంపేట:

శాయంపేట మండల పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాయంపేట సీఐ పి. రంజిత్ రావు , శాయంపేట ఎస్సై జె. పరమేశ్వర్ శాయంపేట మండలంలోని డీజే నిర్వాహకులను పిలిపించి.. వారికి వినాయక ఉత్సవాల సందర్భంగా బుధవారం వారికి తగిన సూచనలు చేశారు. 

నిర్వాహకులకు చేయకూడని పనులను గురించి చెప్పారు. డీజే నిర్వాహకులను బైండోవర్ చేశారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా శాయంపేట మండలంలోని వినాయక మండపాలను సందర్శించి, వినాయక మండప నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.