వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి:

వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో మట్టి వినాయకునికి పూజలు నిర్వహించామని అన్నారు.

ప్రసాదం అన్నదానం లాంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.  మన ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని వెల్లడించారు.

విధుమౌళి శర్మ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు వెల్మల స్వప్న రావు, కాజీపేట స్రవంతి, ఆకుల మానస, మగ్గిడి వెంకట నర్సయ్య, పి. దయాకర్ వర్మ, ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, రాంపల్లి జగన్, గజేల్లి రామ్ దాస్, బర్ల సంతోష్, ఆకుల ప్రవీణ్, వాల్గాట్ మహేష్, గుమ్మడి రాజేశ్వర్, బిగుర్ల శంకర్, మర్రి భాస్కర్, బత్తుల నవీన్, కోల అశోక్ గౌడ్ లు పాల్గొన్నారు.