వేద న్యూస్, జమ్మికుంట ప్రతినిధి:
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జమ్మికుంట ఎంపీపీ మమత గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొడ్డే మమత చెప్పారు.
ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మమత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రణవ్ ను హుజురాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ప్రణవ్ సాదరంగా ఆహ్వానించారు.