వేద న్యూస్, వరంగల్:

రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. తమకు ఎరువులు అందించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పీ ఏ సీ ఎస్ ల ఎదుట క్యూ కట్టి నిలబడుతున్నారు. అయినా తమకు యూరియా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూరియా కోసం రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన సెగ తాజాగా మంత్రి సీతక్కకు తాకింది.!

“సీతక్క డౌన్ డౌన్అంటూ..” యూరియా కోసం రైతుల నిరసన తెలిపారు.ములుగు – గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో చేపట్టారు.

 

పంట పొలాలకు యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా.. ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని, అధికారులు “రేపు మాపు ” అంటూ కాలం వెళ్లదీస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క తగు చర్యలు తీసుకోవాలని, తమకు కావలసినంత యూరియా అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.