• యూఎఫ్ఈపీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు వినతి పత్రాల సమర్పణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హన్మకొండ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (యూఎఫ్ఈపీ) ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై వినతి పత్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ శిక్తాపట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హన్మకొండ జిల్లా ఇన్ చార్జి సునీత, ఈఈ పీసీవోలకు వినతి పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా సోమవారం అధికారులు సానుకూలంగా స్పందిస్తూ..ఇన్ని హరితహిత స్వచ్ఛంద సంస్థలు ఏకమై యూఎఫ్ఈపీ గా ఏర్పడి పర్యావరణ రక్షణకు ముందుకు రావడం చాలా సంతోషం అని అన్నారని ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. మున్ముందు ఈ కాలుష్య సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని వారు వెల్లడించారు.

కార్యక్రమంలో అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్ కుమార్, ఉపాద్యక్షులు పిట్టల రవిబాబు, పగళ్లపాటి రాజ్ కుమార్, సహాయ కార్యదర్షి రాజయ్య, ముఖ్య సలహాదారు షిరాజుద్దీన్, పీఆర్వో మండల పరుశరాములు, సలహాదారులు పరికిపండ్ల వేణు, శ్రీనివాస్, జగన్, డాక్టర్ సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.