- అంగరంగ వైభవంగా గణేష్ భగవాన్ నవరాత్రి ఉత్సవాలు
వేద న్యూస్, మెట్ పల్లి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం బండాలింగాపూర్ గ్రామంలో ఫ్రీడమ్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చాలా ఆనందకరంగా గణేష్ భగవాన్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది.
అదేవిధంగా స్వామివారి శోభయాత్ర ఎలాంటి మందు మాంసాహారాలు తీసుకోకుండా స్వామివారి శోభాయాత్ర మరియు నిమజ్జనం చేశారు.
గత 40 సంవత్సరాల నుండి ఫ్రీడమ్ యూత్ వారు గణేష్ ఉత్సవాలు భక్తి యుక్తంగా భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు..