- జూదరుల అరెస్టు
- ఇందులో ఇద్దరు మాజీ సర్పంచులు
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
కమలాపూర్ మండల పరిధిలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్, కమలాపూర్ మండల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గూడూరులోని మాదాడి శ్రీరాంరెడ్డి పౌల్ట్రీఫాంలో మంగళవారం ఐదుగురు వ్యక్తులు గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కమలాపూర్ మండల పోలీసులు, టాస్క్ ఫోర్స్ వారు దాడులు చేపట్టారు.
ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.22,500, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న వారిలో కట్రోజు వెంకటచారి, అంకటి సాంబయ్య,కుసుంబ కిషన్ రావు, అలిమి కుమారస్వామి, మాదాడ్ శ్రీరాంరెడ్డి ఉన్నారు. వీరిని టాస్క్‌ఫోర్స్ వారు తదుపరి యాక్షన్ నిమిత్తం కమలాపూర్ మండల పోలీసులకు అప్పగించారు.
