వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్‌ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్‌కు గురయ్యాడు.బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తమైంది. అత్యంత అప్రమత్తంగా ప్రజలు ఉండాలని పోలీసులు సూచించారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త యాప్‌ల పేరుతో అమాయకులను మోసగిస్తున్న నేపథ్యంలో, ప్రజలు అపరిచిత యాప్‌లలో వ్యక్తిగత ఫోటోలు, బ్యాంక్ వివరాలు, లేదా అనుమానాస్పద లింకులు ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.