• బీసీ భావజాలాన్ని గ్రామగ్రామాన గడపగడపకు తీసుకెళ్తాం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. అన్ని పార్టీలు బీసీలకు కీలక పదవులివ్వాలి
  • బీసీ రాజ్యాధికారి సభలో ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్
  • కరీంనగర్‌లో బీసీ రాజ్యాధికార సభ.. పెద్ద సంఖ్యలో హాజరైన బీసీ మేధావులు

వేద న్యూస్, కరీంనగర్:

బీఆర్ఎస్ నేత కేటీఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి.. బీసీకీ ఆ పోస్టు ఇచ్చినట్టయితే సదరు పార్టీ బీసీల పక్షాన ఉన్నట్టు భావిస్తామని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ చురకలంటించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలు బీసీలకు కీలక పదవులు ఇవ్వాలన్నారు. కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు, విశిష్ట అతిథి గా సబ్బని వెంకట్ హాజరయ్యారు.

 

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. బీసీల బావాజాలాన్ని గ్రామ గ్రామాన గడపగడపకు తీసుకువెళ్తామన్నారు.  కరీంనగర్ జిల్లాలో బీసీ రాజ్యాధికార సభ కోసం సమావేశం ఏర్పాటు చేశామని.. దీని ముఖ్యదేశం గత 75 సంవత్సరాలుగా బీసీలు ఎంతో నష్టపోతున్నారని ఇకనైనా మేల్కొని బీసీలు నష్టపోకుండా వారి హక్కులను సాధించే దిశగా పోరాటం చేయాలని పేర్కొన్నారు. 

వారు ఆత్మన్యూనత భావాన్ని వదిలి చైతన్యంతో పోరాడావలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇప్పటికే బీసీలలో చైతన్యం నింపడం కోసం కోసం వివిధ పుస్తకాలు ఆర్టికల్స్ ను రాసినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామ గ్రామాన గడపగడపన బీసీ బావాజాలాన్ని తీసుకువెళ్లినట్టు వెల్లడించారు.

గతంలో హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్లో బీసీలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రభుత్వానికి కులగణన చేయాల్సిందిగా డిమాండ్ చేయడంతో ప్రభుత్వం దిగివచ్చినదని .. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించుకునేందుకు పోరాటం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో పొందుపరచాలని వారి డిమాండ్ చేశారు.

అనంతరం సబ్బని వెంకట్ మాట్లాడుతూ..ఒక వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి , లేదా ముఖ్యమంత్రి పదవి వస్తే బీసీలందరికీ న్యాయం జరగదని , మారుమూల పల్లె లో ఒక బీసీ నాయకుడికి కూడా పదవులు లభిస్తేనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

అంతే కాకుండా 42% రిజర్వేషన్ అంశం రాజ్యాంగంలో 9 వ షెడ్యూలులో చేరిస్తేనే పార్టీలను , ప్రభుత్వాన్ని నమ్మగలం అని వెంకట్ వెల్లడించారు.

కేటీర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీ కి ఇచ్చి బీసీ సభలు పెడితే బాగుంటుందని చురకలు అంటించారు. కొందరు రాజకీయ దళారులు బీసీ ఉద్యమాన్ని ఎరగా వేసి అగ్రకులాలకు తొత్తులుగా మారారని విమర్శించారు. అందరికీ సమన్యాయం జరగాలని ఆకాంక్షించారు. అనంతరం బీసీ మేధావులందరూ సభావేదికపై అభివాదం చేశారు. బీసీలు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, సబ్బని వెంకట్ తో పాటు.. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉరుమల్ల విశ్వం, ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, కరీంనగర్ జిల్లా బిసిఐఎఫ్ నాయకులు ఇప్పనపెల్లి సాంబాన్ మాజీ జెడ్పీటిసీ చొప్పదండి తో పాటు సుమారు 1000 మందికి పైగా బిసి మేధావులు పాల్గొన్నారు.