వేద న్యూస్ , హన్మకొండ:

మూగ అటవీ జీవులపై దయ కలిగి ఉండ ట మంటే ఇదేమరి. మంగళవారం ఉదయం హన్మకొండలోని సుబేదారిలో మంగళవారం ఉదయం వీధికుక్కల బారినపడి కొరుకబడుతున్న ముదురు ఆకుపచ్చ తాబేలును హన్మకొండ నివాసి సిరాజ్ వాటర్ పూరిఫయర్, ప్రొప్రైటర్, ఇట్టబోయిన రాజు ఉదయపు నడకలో ఆ వైపు వెళుతుండగా చూసి.. కుక్కల బారినుండి నుండి ఆ టర్టల్ ను రక్షించి అటవీ జీవరాశిపైన ఉన్న తమ ప్రేమను, బాధ్యతను నిరూపించుకున్నారు.

 

వెంటనే ఇట్టిసమాచారాన్ని పర్యావరవేత్త, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ పిట్టల రవిబాబు కు ఫోన్ ద్వారా తెలియచేసారు. వెంటనే స్పందించిన రవిబాబు దానిని ఒక టబ్బులో పెట్టి సగం వరకు నీటిని పోసి అందులో ఆ తాబేలును ఉంచమని, దానిని హన్మకొండ హంటర్ రోడ్డులో గల కాకతీయ జూ పార్కులో అప్పచెప్పాల్సివుంటుందని నేను వస్తున్నానని చెప్పినారు.

ఆ వెంటనే రవిబాబు హన్మకొండకు వచ్చి ఆ తాబేలును పరిశీలించగా అది ఆరోగ్యంగా ఉన్న ఒక “ఇండియన్ ఫ్లాప్ శేల్ టర్టల్ (లిస్సేమిస్ పంక్టటా) గా గుర్తించారు. భారతీయ ఫ్లాప్‌షెల్ తాబేలు (లిస్సేమిస్ పంక్టటా) ని భారత వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 ప్రకారం షెడ్యూల్-I లో ఉంచారు. దీని ద్వారా అత్యధిక రక్షణ కల్పిస్తారని, చట్టపరంగా దీనిని వేటాడటం నేరమని, ఇతర కఠిన నిబంధనలు విధించారని తెలియచేసారు.

భారతీయ ఫ్లాప్‌షెల్ తాబేలు (లిస్సేమిస్ పంక్టటా) దక్షిణాసియాలో కనిపించే మంచినీటి తాబేలుల జాతి. ఇది భారతదేశంలో ఎక్కువగా కనిపించే మంచినీటి తాబేల్లలో ఒకటి.

అదేవిధంగా ఇది పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ , బంగ్లాదేశ్‌లలో కూడా కనిపిస్తుందని, చెరువులు, వాగులు, మడుగులు, సరస్సులు మరియు సాధారణ నదులను ఇది నివాసంగా ఎంచుకుంటుందని, ఇది మితమైన స్థాయిలో ఉప్పునీటినీ తట్టుకోగలదని మరియు నది ముఖతలాలలో కూడా కనిపిస్తుంది అని తెలియచేసారు.

ఆ వెంటనే ఆ టర్టైల్ ను ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు కు సమాచారమిచ్చి, దానిని ఒక కార్టన్ డబ్బాలో భద్రపరచుకొని సొంతవాహనంలో హన్మకొండ హంటర్ రోడ్డులో గల కాకతీయ జూ పార్కుకు తరలించి జూపార్క్ బీట్ ఆఫిసర్ శారద గారికి విషయాన్నీ మొత్తం వివరించగ అప్పచెప్పరు.

 

రెస్క్యూ చేసిన ఇ.రాజును, పర్యావరణవేత్త రవిబాబును అభినందించిన బీట్ ఆఫీసర్ శారద ఆ తాబేలును పరిశీలించి, ఆరోగ్యంగా ఉన్నదని గుర్తించి జూపార్కులోని మంచినీటి కొలనులో వదిలిపెట్టినారని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో  జూపార్క్ సిబ్బంది పాల్గొన్నారు.