వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సబ్-ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న కె. వంశీ కృష్ణ ను సంగేం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎల్. నరేష్ ను మీల్స్ కాలనీ ఎస్. ఐగా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.