• టీపీయూఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సంగెం శ్రీనివాస్

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
సమాజంలో అన్ని వర్గాలవారూ కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. మునుకుంట్ల శ్రీనివాస్( సంగెం శ్రీనివాస్) అన్నారు.

ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మర్రిపల్లిగూడెం గ్రామం లోనీ కాకతీయ విద్యాలయం లో బుధవారం నిర్వహించిన విజయదశమి ఉత్సవం లో ఆయన  ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

 

సామాజిక సామరస్యత, పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌర నియమాలు అనే ఐదు విషయాలను సమాజంలో ప్రతి పౌరుడు తెలుసుకొని వాటి ఆచరణకు నడుంబించాలన్నారు. వీటి ద్వారా సమాజంలో సమూలమైన మార్పు వస్తుందని చెప్పారు.  అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమిగా ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాసూరి రామ్మూర్తి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల తపస్సు కారణంగా నేడు దేశం ప్రగతి పథంవైపు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మర్రిపల్లిగూడెం స్వయం సేవకులు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.