- గాంధీ జయంతి సో వాట్ డోంట్ కేర్?!
వేద న్యూస్, వరంగల్:
గాంధీ జయంతి రోజున దగ్గరుండి వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ CI రఘుపతి రెడ్డి జంతు బలి చేయించారు.!ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నది.
దసరా ఉత్సవాల సందర్భంగా జంతు బలి కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయం కానీ గాంధీ జయంతి రోజు జంతు బలి అనిది దేశవ్యాప్తంగా నిషేధం.
జంతువులను బలి చేయడం మాంసాన్ని విక్రయించడం నేరం. చట్టాలు స్పష్టంగా చెప్పినప్పటికీ నర్సంపేట పట్టణ సిఐ మాత్రం అందుకు విరుద్ధంగా .. గురువారం దగ్గరుండి జంతుబలి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇప్పుడు చర్చగా మారింది.! ఇలా చేయడం సరి కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.