• ​తిప్పాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేని బొలెరో ట్రాలీ పట్టివేత..

వేద న్యూస్,  ఇల్లంతకుంట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో​ తిప్పాపూర్ గ్రామ శివారులో అదనపు ఎస్సై జి. లక్పతి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఒక బొలెరో ట్రాలీలో అక్రమంగా ఇసుక తరలిస్తూ కనిపించింది.

 

వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఇసుక రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేవని తేలింది. ​దీంతో, బొలెరో ట్రాలీని వెంటనే సీజ్ చేసిన పోలీసులు, వాహనంలోని ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ​

ఈ కేసులో తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన డ్రైవర్ చౌదరి వెంకటేష్. వాహన యజమాని కందుకూరి సాయికుమార్ లను అరెస్ట్ చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి, ఇల్లంతకుంట అదనపు ఎస్సై జి. లక్పతి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

​అక్రమంగా ఇసుక తరలించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు.