- సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు వై గీత
వేద న్యూస్, వికారాబాద్:
‘బీసీ’ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ కృషి అవసరమని, ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు వై గీత పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకై తెలంగాణ రాష్ట్ర బంద్ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో బందులో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు. బిసి రిజర్వేషన్ బిల్లు అమలు కొరకు రాజ్యాంగ సవరణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలని చెప్పారు.
రాష్ట్ర గవర్నర్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం వల్ల నోటికాడి ముద్దను లాగేసుకున్నట్లుగా బీసీ ప్రజానీకం పరిస్థితి ఉన్నదని వివరించారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు వివిధ రాజకీయ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు గానే కొనసాగుతున్నారని, రాజ్యాధికారం వైపు ప్రయాణించడం లేదని వివరించారు.
రిజర్వేషన్ల అమలుతో నైనా బీసీలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న పాలకవర్గ పార్టీలు అందుకు కృషి చేయడం లేదని చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కు రాజ్యాంగ సవరణ చేసి తమ సామాజిక బాధ్యతను పాలకవర్గ పార్టీలు నిరూపించుకోవాలని కోరారు.