ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

వేదన్యూస్, గంగాధర :*

గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ తో ఫోన్‌లో మాట్లాడి, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను వేధించిన అటెండర్ యాకూబ్ పాషాను విధుల నుండి పూర్తిగా తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ మెమోలు జారీ చేసి, వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.