వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్రస్థాయి లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పర్యటించారు. వరద ముంపు బాధితులను పరామర్శించి,

కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగామంత్రి సురేఖ సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి కుటుంబానికిఅన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారికిమంత్రి కొండా సురేఖ భరోసా కల్పించారు.