- ప్రకృతి ప్రకోపాలకు మనం కారణం కదా!?
- నేచర్ హెచ్చరికలు షాంపుల్స్ మాత్రమే!
- మనం మారుతేనే ప్రకృతి సమతుల్యం..జీవ మనుగడ
వేద న్యూస్, డెస్క్:
ఏదో ఒక ప్రకృతి విపత్తు వచ్చినపుడే అందరిలో ఈ ఆలోచనల ఊరుకులు ప రు గులు – ఆ తర్వాత షరా మాములే. మనమే సుద్ద పూసలం ప్రకృతి ఏదో మనకు హానిచేస్తున్నదనే శత్రు ఉక్రోశంలో జీవిస్తున్నాం. “మాయదారి వాన,” “నడువంత్రపు వాన పాడుగాను”, “పగబట్టి మా జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది” ,తిట్టుకుంటూ సుద్దపూసల్లా ప్రచారం చేసుంటు ప్రకృతిని తిట్టుకుంటున్నాం కాని, కారణం మనమే కదా? మనకు మనమే ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.
ఇందులో మన పాత్ర, బాధ్యత ఎంత అన్నది ఆలోచించాల్సిన తరుణం ఇది. ఎందరు పకృతికి అనుకూలంగా మారి పర్యావరణ సహేతుక జీవనం జీవిస్తున్నరు? లేచిన దగ్గరనుండి పడుకునేవరకు దాదాపుగా కార్బన్ ఉత్పత్తుల వినియోగమే. ప్లాస్టిక్ వినియోగమే. ప్రమాదకరకమైన రసాయనిక ఉత్పత్తుల వాడుకతో భూ, వాయు, జల, ఆహర కాలుష్యాలాకూ కారణమౌతున్నాం. సందర్భాలను (పండుగలు, పెళ్లిళ్లు, గెలుపు ఆనంద కేరింతలు) అడ్డుపెట్టుకొని ఆ సందర్భాల సహజత్వాన్నే మార్చుతున్నాం. ప్రకృతి సహేతుక బతుకంటేనే ఆఖరి ప్రియారిటీగా ఎంచుకుంటున్నాం, పండుగల్లో, పెళ్లిళ్ళల్లో, ఆచారాలని, వ్యవహారాలని పురాతన ప్రకతి విధానాల స్థానంలో కొత్త సంప్రదాయాలను అద్దుకుంటున్నారు. ఇదేంటి అంటే శత్రువుగా చూస్తూ ప్రకృతికి శత్రువైపోతున్నరు. పాశ్చాత్య పోకడను అలవరుచుకుని ఈ దేశంస్కృతిలా మాట్లాడుతున్నరు. రాబోవుతారాలకు ఈ మార్పులే నిజమని అసలు నిజమైన ఆరోగ్య జీవితాన్ని దూరం చేస్తున్నరు.

ఎవరు ఆలోచిస్తున్నరు?
మార్పు వారిలో లేదా అందరిలో ఎందుకు రాకూడదు? మనకళ్ళముందే ఒక దాశాబ్దం నుండి ప్రకృతి హెచ్చరింపులు అనేక రూపాల్లో, చర్యల్లో తమ హేచ్చరికలను చేస్తూనే ఉన్నాది కదా.! అయినా వీళ్ళు ఎందుకు మారరు? వీరివల్ల ప్రకృతి వికృతిగా మారుతున్నది. బుద్ది చెపుతూనే ఉన్నది. అయినా వీళ్ళు చేస్తుంటే చూస్తున్నరు తప్ప మార్పుదిశగా ఆలోచనే ఆచూకే లేదు. వీరి వెర్రిచేస్టల వళ్ళ పర్యావరణం, జలావరణం, వాయు ఆవరణం, భౌమ్యావరణం మొత్తంగా జీవవరణమే మారిపోతున్నది. కాని వీళ్ళు మారడంలేదు. ఎన్నో వృక్ష, జంతు జీవ జాతులు, నిర్జీవ ఘటకాలు విలుప్తమైపోతున్నాయి. ఇది వీళ్లకు తెలువదా? అయినమారడంలేదు. స్థానికంగా మాట్లాడుతున్నారేగాని ప్రపంచవ్యాప్తంగా (గ్లోబల్గా) ఆలోచించడంలేదు.

వాతావరణంలో కలుషితం వల్ల అనేకమార్పులు, ఉష్నోగ్రతలో మార్పులవల్ల భూమివేడెక్కడం, దానివల్ల చోటుచేసుకునే అతివృష్టి లేదంటే అనావృష్టి, వరదలు, అకాల వర్షాలు, ఉష్నోగ్రత రోజురోజుకు పెరగడం వలన మంచు కరిగి సముద్ర మట్టం పెరిగి సముద్రానికి దగ్గరలో ఉన్న దేశాలు, దేశ ప్రాంతాలు మునిగిపోవడం, కొత్తరోగాలు (ఎమర్జింగ్ డిసీజెస్) భూమిపై పుట్టడం, అడవులను కొట్టివేయడంవల్ల హుమస్ పూర్తిగా నీటితో కలిసి నదులద్వారా సంద్రంలో వృధాగా కలిసి భూమి క్షయానికి గురికావడం, అటవీఆవాసంలో అసమాతుల్యతతో ఆహారపు గొలుసు మార్పువాళ్ళ జీవజాతులు విలుప్తమవడం, కొండచర్యలు విరిగిపాడడం, మంచు, ఇసుకతుపానులు, సుడిగాలిభీభత్సం, భుజల క్షీనత వల్ల త్రాగు, సాగునీటి, పారిశ్రామిక వాడకానికి ఎద్దడి మొదలైనవి ఇంకా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది.

అభివృద్ధి కి అడ్డు చెప్పడం లేదు
అభివృద్ధిని ఎవరం కాదనడంలేదు కాని, మానవ, జీవ ప్రపంచమే నాశనమయ్యే అభివృద్ధి ఎందుకు? ఎవరికోసం?
ఉదాహరణకు: 1. ఒకప్పుడు యుద్దాలకొరకు ఆయుధాలు చేసేవారు కాని, ఇప్పుడు ఆయుధాలా అమ్మకంకోసమే యుద్దాలను చేస్తున్నారు, చేయిస్తున్నరు. 2. ఆహరకొరత ను అడ్డుకునే హైబ్రిడ్ ఆవిష్కరణలు, ఆహారంలో ఎన్నోమార్పులతో ఆరోగ్యాన్నే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నోరోగాలకు సృష్టికి కారణమౌతున్నారు. 3. కొత్తమార్పులని ఆవిష్కరణలు అని యంత్రిక వ్యవసాయమని వ్యవసాయాన్ని కలుషితం చేశారు. రైతునే అన్నమోరామచంద్ర అనేలా అరిపిస్తున్నారు. మొత్తంగా ఈ దేశంలోని సహజ వాతావరణాన్ని నాశనం అయినా పర్వాలేదని ఇక్కడి సహజ వనరులను అవసరంకన్నా ఎక్కువగా కొల్లగొట్టి వాటిని డబ్బు రూపంలోకి మార్చుకొని వారు, వారి పిల్లల ఆరోగ్యాకరమైన జీవనం, బతుకుదెరువుకోసం యూరోప్ లాంటి క్లీన్ ఎన్విన్మెంట్ దేశాల్లో కొందరు ఈ దేశంలోని ప్రతికూల వాతావరణాన్ని దూరదృష్టితో అలోచించి మైందే ఆ దేశాల్లో, కొన్ని ద్వీపాల్లో ఇల్లు స్థలాలు కొనుక్కుంటున్నారు కొందరు(సినీ తరాలు, ఇండస్ట్రీయలిస్టులు, క్రీడాకారులు మొ. వారు) అంటే మీరు నమ్మగలరా? అవును ఇది అక్షరాల నిజం. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ పేర్లు ప్రస్థావించాల్సిన అవసరం లేని నిజం. 4. 15 రోజుల నుండే మొంథా తుఫాను వస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసిన ఎవరు పట్టించుకున్నారు?, ప్రభుత్వ పాలకులా?, అధికారుల?, ప్రతిపక్షాలా?, లేదా రాజకీయనాయకులా?….. 5. ఎవ్వరికీ పట్టింపులేదు. కాని రైతులుమాత్రం ఎంతో నష్టపోతున్నారు, ఆరుకాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే నీళ్లల్లో తడిసిపోతుంటే ఎవడివల్లో మారిన వాతావరణచక్రము వల్ల ఏర్పడిన ఈ మార్పుకు రైతు ఆర్ధికగా, మానసికంగా కృశించి, క్రుంగి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నడు. పంట ఉత్పత్తులను కొంటామన్నా ప్రభుత్వాలకు ఎన్నికల్లో (జూబ్లీ హిల్స్) గెలువాలనే ఆరాటమే తప్ప రైతుల పంటల కొనుగోళ్లు చేయించాలానే సోయి ఉన్నదా మనమే ఆలోచించాలి.

6. పంటల్లో పంట మార్పిడులున్నాయా? చిరుధాన్యాల పంటలు పూర్తిగా పోగొట్టుకుంటున్నాం, కమర్షియల్ క్రాప్స్ ఎంతవరకు సురక్షితమో, ఈ మార్పుకు కారణమేవరో తెలుసుకోవాలి. దీనివల్ల ఆహర కొరత, అసమతుల్య ఆహర వినియోగ ప్రమాదాలు, ఆరోగ్య రుగ్మతలు ఎన్నో చవి చూడాల్సివస్తుంది.

కళ్ళముందే జరిగే తతంగాలను చూస్తున్నాం. కారణం, కారకులు, పర్యవసానాలు, ప్రతిఫలాలు, రాబోవు ఆపదలు తెలిసినా చూస్తూ అందరిలో నేను, అందరితో నేను అనే జుగుప్స్తలో మన మెదల్ల లో ఆలోచనలు పాకురులా ఉన్నంతకాల ఎంత చెప్పినా మార్చలేం. ఇలాంటి ముంపుల్లో, మానవశ్రుష్టి, ప్రకృతి సృష్టించే వైపారీత్యాల్లో కొట్టుకుపో వలసిందే. ఇది కోంతో స్వీయంగా చెప్పేది కాదు.
శాస్త్రియంగా నిరూపించబడినదే, కరోనా లాంటి మహమ్మారి తేల్చిన మిగిల్చిన గుణపాఠాల అనుభవంతో చెపుతున్నదే. అయినా మేరనుకుంటున్న మార్పు ప్రతీ వాడి మాటల్లోనేకాదు చేతల్లో రావాలి గాని మనం ఎంతచెప్పిన చెవిటోనిముందు శంకమూదిన విధమే కాని ఏమిచేయలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి.
అయినా మన ఆత్రంగాని… “నిద్రపోయేవాణ్ణి తట్టి లేపగలం కాని, అన్నీ తెలిసి నిద్రపోతున్నట్టు నటించే మూర్ఖులను లేపగలమా” అయినా ప్రయత్నాన్ని చేస్తూనే ఉందాం. ఏరోజైనా మారొచ్చేమో. కనీసం రేపటి తరాలైనా సంతోషజంగా జీవిచేలా..!
కలిసి నడుద్దాం
కనీసం వ్యక్తిగతమార్పుకోసం మంచి ప్రకృతి సహేతుకంగా జీవించే వాళ్ళ స్పందనలైన రావాలికదా. కలిసి నడుద్దాం పర్యావరణ రక్షనకోసం. అయినా ప్రకృతి, పర్యావరణం, సహజవరుల, ప్రకృతివ్యవసాయం, ఆరోగ్యాకరమైన ఆహరఉత్పత్తి రక్షణ కోసం, మంచి కోసం మనం నడుం బిగించాల్సిందే. అందరిని మనతో కలిపుకోను పోవాల్సిందే.
ఇప్పటికైనా ప్రకృతి, పర్యావరణ స్మతుల్య వ్యతిరేక విధ్వంసాలను మానుకొని, పర్యావరణ హిత జీవితాన్ని జీవిస్తూ మారుతున్న వాతావరణాన్ని మార్చుకొని జీవిస్తూ రేపటి తరాలకు మంచి ఆరోగ్యకర సుస్థిర పర్యావరణాన్ని ఇస్తూ అంతే జీవనాన్ని మనచ్చుట్టువున్న నిర్జీవ, సజీవ ప్రపంచానికి జీవనాన్ని మిగిలించాలి. అప్పుడే ఈ అమూల్యమైన భౌమ్యావరణంలో జీవ మనుగడ కొనసాగుతుంది.
“ప్రకృతి రక్షతీ రక్షితః”
– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే ఎన్ టి యూ హెచ్, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.
