వేద న్యూస్, కరీంనగర్:

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టి మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుఢీకొట్టినది.

15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో, ట్రాక్టర్ లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.