వేద న్యూస్, వరంగల్ టౌన్:
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 7న తేదీన దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.ఈ సందర్భంగా వరంగల్ రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్లో వాగ్బాట యోగ సంఘం సభ్యులు వందేమాతరం గీతాలపన చేశారు.వందేమాతర గీత విశిష్టతను వాకర్స్ కి తెలియజేసారు.