వేద న్యూస్, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలకోసం , రాజకీయాల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం సమాజసం కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వంలో గుత్తదారు రోడ్డు మరమ్మత్తుల పనులు మొదలు పెట్టి ఉన్న రోడ్డు సర్వనాశనం చేశాడు. ఇటు గ్రామ రైతులకు, ప్రయాణికులకు చాల ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దిబ్బతున్నది. మీ..మీ రాజకీయ కక్షల కోసం మా గ్రామానికి వచ్చే నిధులను ఆపడం సరైన పద్ధతి కాదని గ్రామస్థులు మండి పడ్డారు. ఈ విషయం మా గ్రామంలో ఉన్న అధికార పార్టీ నాయకుల కు అర్థం కావడం లేదా?? ఎందుకు పని ఆగిపోయింది అని ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు??ఎప్పుడు చూసినా పార్టీ రాజకీయ లా గురించి తప్పా గ్రామ అభివృద్ది గురించీ చిత్తశుద్ధి లేదు! అసలు గెలిచి ఏదో అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పే నాయకులు మా గ్రామం లో తట్టెడు మన్ను తీయలేదనీ ఆరోపించారు. వెంటనే రెండు రోడ్డులు పునర్నిర్మాణం చేపట్టాలి లేదంటే గ్రామ ప్రజలందరం కలసి క్యాంపు కార్యాలయంన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తమ గ్రామాల్లో తిరగకుండా చేస్తామని గ్రామ ప్రజలు హెచ్చరిక చేశారు.