వేద న్యూస్, నాగర్ కర్నూల్:

ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీశాఖ అధికారిపై దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తుండగా, అక్కడ ఎఫ్ఎస్ వో జయరాజు విధినిర్వాహణలో భాగంగా అడ్డుకోగా, కొందరు వారిపై దాడి చేసి గాయపరిచారు.

దీంతో అక్కడికి ఎఫ్డిఓ చంద్రశేఖర్ అధికారులు రోహిత్ గోపిడి తదితర సిబ్బంది వెళ్లి ఆయన్ను పరామర్శించారు. సమీప కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారిపై దాడి క్షమించారానిదని, అధికారులు ఈ విషయం పై వెంటనే స్పందించి దాడిచేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ కోరింది. నిందితుల దాడిని ఖండిస్తున్నామని, ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు అండగా ఉంటామని ఓ ప్రకటనలో వెల్లడించింది.