- పూర్తి నివేదిక కలెక్టర్ కు సమర్పిస్తాం
- వెల్లడించిన అధికారులు
వేద న్యూస్, టేక్మాల్:
‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ నెల 23న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘అంగన్ వాడీ సరుకులు అంగడిపాలు!’ శీర్షికన కథనం ప్రచురితమయింది. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం టీచర్ సరుకులను మార్కెట్కు ఆటోలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారని కథనంలో వెల్లడించారు. చిన్నారులు, గర్భిణులకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతిని విశదీకరించారు.
ఈ వార్తకు గ్రేడ్ వన్ సూపర్ వై జర్ నాగమణి, పిడి పద్మావతి స్పందించి విచారణ చేపట్టారు. పిల్లలు, గర్భిణులకు ఇచ్చే గుడ్లు ఇతర నిత్యావసరాలను ఇతరులకు సంబంధించిన రికార్డులను సోమవారం పరిశీలించారు.
రికార్డులు పరిశీలించిన అధికారులు సరుకులకు సంబంధించిన వివరాలను, టీచర్, ఆయా ల వచ్చిన ఆరోపణలు పరిశీలించి పూర్తి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని వారు తెలిపారు.

