వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన అధ్యక్షులకు మంగళవారం గాంధీభవన్లో ఏఐసిసి జాబితా ప్రకారము నూతన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నూతన అధ్యక్షునిగా నియమింపబడిన మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా నూతన అధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, విశ్వనాధన్, సచిన్ సావంత్, రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి తూర్పు శాసనసభ్యులు కొండ సురేఖ, శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి,రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజ్, యశస్విని రెడ్డి,
నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను
వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ ఏఐసిసి, పిసిసి పిలుపుమేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తానని అన్నారు. అలాగే పదవి రావడానికి జర్నలిస్టుల సహకారం సైతం ఉందని వారికి ధన్యవాదాలు తెలిపారు.