– ఏంఐఎస్ ఆఫీసర్ అక్కల రమేష్

వేద న్యూస్, శాయంపేట:

మహిళలు వ్యవసాయం రంగంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చే వివిధ సంస్థల సహకారంతో మహిళలను ముందంజలో ఉండాలని అక్కల రమేష్ అన్నారు. అనునిత్యం వారి యొక్క శ్రేయస్ కోసము ప్రజ్వల్ సంస్థ వారు తోడ్పాటు అందిస్తుంది అన్నారు.వారి జీవన విధానంలో జీవనోపాదులు మెరుగుపరుచుకునే కార్యక్రమాలను అభివృద్ధి చెందే విధంగా అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వ అందించేటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలని వారు వివరించారు.లేబర్ కార్డు, ప్రధానమంత్రి సంరక్షణ, ప్రధానమంత్రి జీవనజ్యోతి, మహిళ సంఘాలలో వివిధ రంగాల ఆర్థిక రుణాలు సదుపాయాలను సద్వినియోగం చేసుకొని కుటుంబంలో పోషణకు ముఖ్యపాత్ర వహించాలని వారు అన్నారు. అంతేకాకుండా ప్రజ్వల్ రైతు సంఘం నిర్వహిస్తున్నటువంటి బీసీఐ ప్రాజెక్టు కార్యక్రమాలు ఒక రంగోలి ద్వారా వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం పాలకవర్గ సభ్యురాలు ఎడ్ల రజిత ,ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది ఎస్కే గౌస్, పోరండ్ల భానుమతి, కుక్కల కల్పన, పోతు సునీల్, రవిచందర్, అనీఫా, అమరేందర్ రెడ్డి, రాంబాబు, వంశీ, చిట్టి, తిరుపతి,ప్రశాంత్, మహిళా సాధికారిత సంబంధించిన వివిధ రంగాల సంస్థ ప్రతినిధులు అనూష, విజయ్, రమేష్, మానస, మహిళలు తదితరులు పాల్గొన్నారు.