వేద న్యూస్,కరీంనగర్:
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరెపల్లి వాగులో ఒర్రెలో నిర్మించే వాగునా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ బృందం సందర్శన చేయడం జరిగింది. స్మశానవటిక నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిన చేయడం జరిగింది. అనంతరం కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు మాట్లాడుతూ ఆరెపల్లి ప్రజలకు ఉపయోగపడేలా స్మశానవటికను నిర్మించాలని అన్నారు. ఆరెపల్లి (ఒర్రెలో) వాగులో నిర్మించడం వలన కాంట్రాక్టర్ ను బతికాంచడం తప్ప ఎవ్వరికి ఉపయోగం ఉండదని అన్నారు. నగరపాలక సంస్థ ఇంగినిర్ లు ,కాంట్రాక్టర్ కుమ్మకాయి వాగులో నిర్మిస్తున్నారని ఆరోపించారు. స్మశానవటిక నిర్మాణానికి నగరపాలక సంస్థ నుండి రూ.49.50లక్షలు నిధులు కేటాయించినరాని అన్నారు. ఒక్క వర్షం గట్టిగా పడితే కొత్తపల్లి చెరువు నుండి వాగు ఒర్రె ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి పెద్ద ఎత్తున వాగు ఉప్పొంగి వాగులో నిర్మించిన స్మశానవాటిక కొట్టుకుపోతుందని అన్నారు. స్మశానవాటిక కోసం నిర్మించిన ప్రజాధనం 59.50లక్షలు వృధా అవుతాయి. ప్రజాధనం పూర్తిగా నీటిలో పోసిన పన్నీరు లాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెపల్లి గ్రామంలో మరొక ప్రాంతంలో స్మశాన వాటి నిర్మాణానికి ప్రభుత్వ స్థలం ఉన్నది. ఆ ప్రభుత్వ స్థలానికి వెళ్ళుటకు అవసరమైతే రైతులు 30 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కావున ఆరెపల్లి స్మశాన వాటికను వాగులో కాకుండా మరో ప్రాంతానికి నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే మా పార్టీ ఆధ్వరంలో నగరపాలక సంస్థ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.