వేద న్యూస్, కాసిపేట:
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడిగా నిలిచిన శ్రీకాంత్ చారి 16వ వర్ధంతిని కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలో ప్రజా సంఘాలు గౌరవప్రదంగా నిర్వహించాయి. గోనెల శ్రీనివాస్, శ్రీలత ఆధ్వర్యంలో సోమవారం వర్ధంతి కార్యక్రమం జరగ్గా, అమరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు శ్రీకాంత్ చారి త్యాగాలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేనివని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన చేసిన త్యాగం ఈ తరం మాత్రమే కాక రానున్న తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపన్న, చిన్న భీమయ్య, భోగి పోశం, సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.